ఆ వీడియోకాల్‌ను హ్యాక్‌ చేసిందెవరు..?

ఇంటర్నెట్‌ డెస్క్‌: థ్రిల్లర్‌ సినిమాల నిపుణుడు కె.వి.గుహన్‌ దర్శకత్వంలో మరో క్రైమ్‌థ్రిల్లర్‌ చిత్రం రాబోతోంది. కళ్యాణ్‌రామ్‌ హీరోగా ‘118’తో తెరకెక్కించి సత్తా నిరూపించుకున్నారాయన. ఈసారి సైబర్‌క్రైమ్‌ ఆధారంగా ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసేందుకు సిద్ధమయ్యారు

డబ్ల్యూ.డబ్ల్యూ.డబ్ల్యూ(ఎవరు, ఎక్కడ, ఎందుకు) పేరుతో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అదిత్‌ అరుణ్‌, శివాని రాజశేఖర్‌ జంటగా నటించారు. ఈ సినిమా టీజర్‌ను సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు తాజాగా విడుదల చేశారు. టీజర్‌ ఆసక్తిని రేకెత్తిస్తోంది.

టీజర్‌ సాగిందిలా.. ‘‘నలుగురు స్నేహితులు సరదాగా వీడియోకాల్‌ మాట్లాడుతూ ఉంటారు. ఇంతలో ఒక్కసారిగా ఊహించని అంతరాయం. ఎవరో వాళ్ల కాల్‌ను హ్యాక్‌ చేశారు. వాళ్ల పాస్‌వర్డ్‌లు, ఇతర సమాచారం మొత్తం లాగేసుకున్నారు. అందులో హీరోహీరోయిన్లు ఏకాంతంగా మాట్లాడుకున్న సంభాషణలు కూడా ఉన్నాయి. ఇది కచ్చితంగా బ్రూట్‌ ఫోర్స్‌ అటాక్‌ అంటూ ఓ డైలాగ్‌.. ఇంతకీ ఆ అటాక్‌ చేసింది ఎవరు.? వాళ్లు ఉండేది ఎక్కడ..? అసలు ఎందుకు ఇలా చేశారు..? అనేదే కథాంశం. ఫస్ట్‌లుక్‌ను రానా విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రియదర్శి, రాజ్‌కుమార్‌ సతీష్‌, వైవా హర్ష కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సినిమాను డా.రవి, పి.రాజు దాట్ల నిర్మిస్తున్నారు. సిమన్‌ కె.కింగ్‌ సంగీతం అందించారు. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.

Arun Adith and Shivani Rajashekar will be seen as the lead pair.

Music
Editing
Dialogues
Choreography
Co-producer
Producer
Story, Cinematography & Direction

: Simon King
: Thammiraju
: Mirchi Kiran
: Prem Rakshit
: Vijay Dharan Datla
: Dr. Ravi P. Raju Datla
: K V Guhan