‘డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు’ నైలున‌ది సాంగ్ బాగుంది: త‌మ‌న్నా

‘118’ వంటి సూప‌ర్‌హిట్ చిత్రాన్నితెర‌కెక్కించిన ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ కేవి గుహన్ ద‌ర్శ‌కత్వంలో రూపొందుతోన్నలేటెస్ట్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ ‌'డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు'(ఎవ‌రు, ఎక్క‌డ‌, ఎందుకు). అథిత్ అరుణ్‌, శివాని రాజ‌శేఖ‌ర్ హీరోహీరోయిన్లుగా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని రామంత్ర క్రియేష‌న్స్ ప‌తాకంపై డా. ర‌వి పి. రాజు దాట్ల నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్‌కి మంచి స్పందన వస్తోన్న తరుణంలో... తాజాగా ఈ మూవీ నుండి ప్ర‌ముఖ గేయ ర‌చ‌యిత రామ‌జోగ‌య్య‌శాస్త్రి సాహిత్యం అందించ‌గా స్టార్ సింగ‌ర్ సిద్‌ శ్రీ‌రామ్, క‌ళ్యాణి నాయ‌ర్ ఆల‌పించిన మెలోడియ‌స్ సాంగ్ 'నైలు న‌ది'ని స్టార్ హీరోయిన్ త‌మ‌న్నా రిలీజ్ చేశారు. ఈ సంద‌ర్భంగా స్టార్ హీరోయిన్ తమ‌న్నా మాట్లాడుతూ.. ''నైలున‌ది సాంగ్ బాగుంది. గుహ‌న్ గారు 'డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు'తో మ‌రో మంచి హిట్ కొట్టాలి. ఆదిత్‌, శివాని రాజ‌శేఖ‌ర్‌ల‌కు ఆల్ ది బెస్ట్. అలాగే రామంత్ర క్రియేష‌న్స్ టీమ్‌కి నా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను..'' అన్నారు.

ద‌ర్శ‌కుడు కేవి గుహ‌న్ మాట్లాడుతూ .. ''నైలున‌ది మెలోడియ‌స్ సాంగ్‌ని రిలీజ్ చేసిన త‌మ‌న్నాకి థ్యాంక్స్‌. డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ జ‌రుగుతోంది. థ్రిల్ల‌ర్ జోన‌ర్‌లోనే ఇది డిఫ‌రెంట్ మూవీ" అని తెలుపగా.. చిత్ర నిర్మాత డా. ర‌వి పి.రాజు దాట్ల మాట్లాడుతూ.. ''త‌మ‌న్నాగారు మా నైలున‌ది సాంగ్ రిలీజ్ చేసినందుకు స్పెష‌ల్ థ్యాంక్స్‌. గుహ‌న్ గారి డైరెక్ష‌న్లో డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు అంద‌రినీ త‌ప్ప‌కుండా థ్రిల్ చేస్తుంది" అన్నారు.

నా ఫ‌స్ట్ మూవీ డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యులో నాకు ఎంతో ఇష్ట‌మైన నైలున‌ది సాంగ్‌ని నాకు ఎంతో ఇష్ట‌మైన హీరోయిన్ త‌మ‌న్నా గారు రిలీజ్ చేయ‌డం చాలా హ్యాపీగా ఉందని హీరోయిన్ శివాని రాజ‌శేఖ‌ర్ తెలుపగా.. ''అడిగిన వెంట‌నే మా మీద అభిమానంతో నైలు న‌ది సాంగ్ రిలీజ్ చేసిన త‌మ‌న్నా గారికి థ్యాంక్స్‌. ఈ సాంగ్ డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు మూవీలో ఒక హైలెట్ అవుతుంది" అన్నారు హీరో అథిత్ అరుణ్. రామ‌జోగ‌య్య శాస్త్రి మాట్లాడుతూ.. ''డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు మూవీ నుండి నేను రాసిన మంచి ల‌వ్‌సాంగ్ నైలున‌ది.. పెరిగిన దూరం మ‌రికొంచెం ప్రేమ‌ను పెంచింది. ఈ సాంగ్‌ని త‌ప్ప‌కుండా మీరు ఎంజాయ్ చేస్తారు" అన్నారు.

Listen To The Song

Arun Adith and Shivani Rajashekar will be seen as the lead pair.

Music
Editing
Dialogues
Choreography
Co-producer
Producer
Story, Cinematography & Direction

: Simon King
: Thammiraju
: Mirchi Kiran
: Prem Rakshit
: Vijay Dharan Datla
: Dr. Ravi P. Raju Datla
: K V Guhan