‘డ‌బ్లూడ‌బ్లూడ‌బ్లూ’ తో వస్తున్న కేవి గుహ‌న్

`118` వంటి స‌క్సెస్‌ఫుల్ చిత్రాన్నితెర‌కెక్కించిన ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ కేవి గుహ‌న్ త‌న త‌దుప‌రి చిత్రంగా మ‌రో డిఫ‌రెంట్ థ్రిల్ల‌ర్‌ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి `డ‌బ్లూడ‌బ్లూడ‌బ్లూ`(హూ,వేర్‌,వై) అనే టైటిల్ ఫిక్స్ చేశారు.

అథిత్ అరుణ్‌, శివాని రాజ‌శేఖ‌ర్ హీరోహీరోయిన్లుగా న‌టిస్తున్నఈ మూవీని రామంత్ర క్రియేష‌న్స్ ప‌తాకంపై డా. ర‌వి పి. రాజు దా‌ట్ల నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకున్నఈ సినిమా ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటోంది. త్వ‌ర‌లో ఈ చిత్రం టైటిల్‌లోగోను విడుద‌ల‌చేయ‌నున్నారు.

సినిమా టైటిల్‌ను ప్రకటించిన సంద‌ర్భంగా నిర్మాత‌ డా. ర‌వి పి.రాజు ద‌ట్ల మాట్లాడుతూ.. ‘‘కేవీ గుహ‌న్ గారు తెర‌కెక్కించిన ‘118’ మూవీ ఎంత‌ పెద్ద హిట్ అయ్యిందో మ‌నంద‌రికీ తెలుసు. ఇప్పుడు ఆయ‌న రెండో చిత్రంగా ఒక డిఫ‌రెంట్ థ్రిల్లర్ స‌బ్జెక్ట్‌తో వస్తున్నారు. దీనికి ‘WWW’ అనే టైటిల్ ఖరారు చేశాం. రామంత్ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌లో హై టెక్నిక‌ల్ వాల్యూస్‌తో ఈ మూవీ రూపొందుతోంది. సిమ‌న్ కె. కింగ్ సంగీత సార‌థ్యం వ‌హిస్తుండ‌గా మిర్చికిర‌ణ్ ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్స్ అందించారు. టెక్నిక‌ల్‌గా మంచి టీమ్ కుదిరింది. త్వర‌లోనే టైటిల్ లోగోని విడుద‌ల‌చేస్తాం’’ అని అన్నారు.

IMG-20201215-WA0035-696x1044

అథిత్ అరుణ్‌, శివాని రాజ‌శేఖ‌ర్ హీరోహీరోయిన్లుగా న‌టిస్తోన్న ఈ చిత్రానికి

సంగీతం                                                                      :  సిమ‌న్ కె. కింగ్‌,

ఎడిటింగ్‌                                                                    :  త‌మ్మిరాజు,

డైలాగ్స్‌                                                                      :  మిర్చికిర‌ణ్‌,

కొరియోగ్ర‌ఫి                                                              :  ప‌్రేమ్ ర‌క్షిత్ మాస్ట‌ర్,

కో-ప్రొడ్యూస‌ర్‌                                                         : విజ‌య్ ధ‌ర‌ణ్ దాట్ల‌,
                    
నిర్మాత‌                                                                      : డా. ర‌వి పి.రాజు దా‌ట్ల ,

క‌థ‌,  సినిమాటోగ్ర‌ఫి,  ద‌ర్శ‌క‌త్వం                 : కేవి గుహ‌న్‌.

అథిత్ అరుణ్‌, శివాని రాజ‌శేఖ‌ర్ హీరోహీరోయిన్లుగా న‌టిస్తోన్న ఈ చిత్రానికి

సంగీతం: సిమ‌న్ కె. కింగ్‌,

ఎడిటింగ్‌: త‌మ్మిరాజు,

డైలాగ్స్‌: మిర్చికిర‌ణ్‌,

కొరియోగ్ర‌ఫి: ప‌్రేమ్ ర‌క్షిత్ మాస్ట‌ర్,

కో-ప్రొడ్యూస‌ర్‌: విజ‌య్ ధ‌ర‌ణ్ దాట్ల‌,

నిర్మాత‌: డా. ర‌వి పి.రాజు దా‌ట్ల ,

క‌థ‌, సినిమాటోగ్ర‌ఫి, ద‌ర్శ‌క‌త్వం: కేవి గుహ‌న్‌.