WWW: ఆక‌ట్టుకుంటోన్న ‘క‌న్నులు చెదిరే’ గీతం

ఇంట‌ర్నెట్ డెస్క్‌: అదిత్ అరుణ్‌, శివానీ రాజ‌శేఖ‌ర్ జంట‌గా తెర‌కెక్కుతోన్న చిత్రం ‘డ‌బ్ల్యూ డ‌బ్ల్యూ డబ్ల్యూ’. కె.వి.గుహ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. తాజాగా ‘క‌న్నులు చెదిరే అందాన్ని’ అంటూ సాగే ప్రేమ గీతాన్ని విడుద‌ల చేసింది చిత్రబృందం. ఈ పాట‌కి అనంత శ్రీరామ్ సాహిత్యం అందించ‌గా, యాజిన్ నైజ‌ర్ ఆల‌పించారు. సిమ‌న్ కె.కింగ్ స్వ‌రాలు స‌మ‌కూర్చారు. యూ ట్యూబ్‌లో.. విడుద‌లైన కొన్ని క్ష‌ణాల్లోనే అత్య‌ధిక వీక్ష‌ణలు సొంతం చేసుకుంది ఈ మెలొడీ. రామంత్ర క్రియేష‌న్స్ ప‌తాకంపై ర‌వి ప్ర‌సాద్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రియ‌ద‌ర్శి, వైవా హ‌ర్ష‌, స‌త్యం రాజేశ్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషించిన ఈ సినిమా త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

ఈ చిత్రం గురించి దర్శకుడు కేవీ గుహన్‌ మాట్లాడుతూ, మా కొత్త చిత్రం టీజర్‌ను మక్కళ్‌ సెల్వన్‌ విజయ్‌ సేతుపతి రిలీజ్‌ చేయడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ చిత్ర కథను ఆయన ఎంతో ఆతృతగా అడిగి తెలుసుకున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా శివానీ రాజశేఖర్‌ నటించింది. ఆమె నటన ఈ చిత్రానికి ఎంతో ప్లస్‌ అవుతుంని నమ్ముతున్నాం. ఈ చిత్రంలో ఆదిత్‌ అరుణ్ అద్భుతంగా నటించారని తెలిపారు.

తమిళం, తెలుగు భాషల్లో ఏక కాలంలో నిర్మితమవుతున్న ఈ చిత్రానికి కథ, స్ర్కీన్‌ ప్లే అందించిన కేవీ గుహన్‌ దర్శకత్వం కూడా చేశారు. రమాంత్రా క్రియేషన్స్‌ పతాకంపై రూపొందుతోన్న ఈ చిత్రానికి డాక్టర్‌ రవి ప్రసాద్‌ రాజు దాట్ల నిర్మాతగా, విజయ్‌ ధరణ్‌ దాట్ల సహాయ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటివరకు ఎన్నో విజయవంతమైన ఆల్బమ్‌లు అందించిన యువ సంగీత దర్శకుడు సైమన్‌ కె.కింగ్‌ సంగీత బాణీలు సమకూర్చుతున్నారు.

Watch Now

Arun Adith and Shivani Rajashekar will be seen as the lead pair.

Music
Editing
Dialogues
Choreography
Co-producer
Producer
Story, Cinematography & Direction

: Simon King
: Thammiraju
: Mirchi Kiran
: Prem Rakshit
: Vijay Dharan Datla
: Dr. Ravi P. Raju Datla
: K V Guhan